యువ కవికి సంకలనం అందజేత


Mon,October 14, 2019 02:53 AM

ఓదెల: కరీంనగర్ ఫిల్మ్ భవన్‌లో ఉదయ సాహితీ అధ్యక్షుడు వైరాగ్యం ప్రభాకర్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా బాపుబాటలో అక్షరాంజలి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ పుస్తకంలో యువకవి బ్రహ్మాండ్లపల్లి రవీంద్రాచారి రాసిన కవిత జాతాపిత మహాత్మా అనే కవిత అచ్చు వేశారు. ఇందుకు సంకలనాన్ని రవీంద్రాచారికి రంగినేని మోహన్‌రావు చేతుల మీదుగా అందజేసి ప్రశంసించారు. కార్యక్రమంలో ఉదయ సాహితీ అధ్యక్షుడు ప్రభాకర్, పత్తిపాక మోహన్, గజేందర్‌రెడ్డి, సేనాధిపతి, రామకృష్ణ, కవులు, కవయిత్రులు తదితరులు పాల్గొన్నారు.

51

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles