ప్రతి మద్యం దుకాణానికీ పర్మిట్ రూం


Mon,October 14, 2019 02:53 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం 2019-2021 కోసం ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో ప్రతి మద్యం దుకాణానికీ పర్మిట్ రూం అనుమతి ఉంటుందని టాస్క్‌ఫోర్సు అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రితం సారి రూ.5లక్షల దరావత్తు చెల్లించాల్సి ఉండేదనీ, ఈ సారి దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి దరావత్తు రుసుం లేదన్నారు. దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వం సరళీకృతం చేసిందనీ, గతంలో మాదిరిగానే ప్రతి దుకాణానికీ పర్మిట్ రూం తీసుకునే వెసులుబాటు ఉందనీ, దీనికోసం ఎలాంటి ఆదనపు రుసుం చెల్లించాల్సినవసరం లేదన్నారు.


గతంలో మున్సిపాలిటీలో ఒక షాపును ఒకే వార్డు పరిధిలో ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చేదనీ, కానీ, ప్రస్తుత విధానంలో నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ వార్డులను కలిపి వార్డులను క్లస్టర్‌గా ఏర్పాటు చేశామన్నారు. దీంతో మద్యం దుకాణం దక్కించుకున్న వ్యక్తి ఆయా వార్డుల పరిధిలో ఎక్కడైనా దుకాణాన్ని ఏర్పాటు చేసుకునే వీలుంటుందన్నారు. ఎక్సైజ్ టాక్స్ చెల్లింపు వా యిదాలు గతంలో 6 ఉండేవని, వాటిని ప్రభుత్వం ఈసారి 8కి పెంచిందన్నారు. గతంలో ఉన్న బ్యాంకు పూచీకత్తు ఎక్సైజ్ టాక్స్‌లో 67 శాతం నుంచి 50 శాతానికి తగ్గించారన్నారు. మద్యం దుకాణం కోసం వ్యాపారులు దరఖాస్తులను అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ ప్రభాకర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

59

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles