అధిక వసూళ్లు వద్దు


Mon,October 14, 2019 02:53 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేయరాదని ఉమ్మడి జిల్లా డీటీ సీ పుప్పాల శ్రీనివాస్ సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని డీపోలోని టిమ్ మెషిన్లను ఆదివారం డీటీసీ పుప్పాల శ్రీనివాస్, ఆర్‌ఎం జీవన్ ప్రసాద్, డీటీఓ కిషన్‌రావు పరిశీలించారు. ఈ సం దర్భంగా డీటీసీ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నందున ఆర్టీసీ బస్సులు, అద్దె బస్సు ల్లో ప్రయాణం చేస్తున్న వారి వద్ద నుంచి అధికం గా చార్జీలు వసూలు చేయరాదన్నారు. తాత్కాలిక డ్రైవర్లకు త్వరలో టిమ్ మెషిన్లపై శిక్షణ ఇచ్చి వా టిని ఎలా వాడాలో తెలియజేస్తామన్నారు. టిమ్ మెషిన్లను తాత్కాలిక కండక్టర్లకు అందజేసిన త ర్వాత అధిక చార్జీలు అన్న విషయం రాదన్నారు.


తప్పనిసరిగా టికెట్‌పై ఉన్న ధరను మాత్రను ప్ర యాణికులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. టిమ్ మెషిన్లలో ఉన్న పాత సాఫ్ట్‌వేర్ స్థానంలో కొత్త సా ఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసి, దీనిపై కండక్టర్లకు శిక్షణ ఇ చ్చిన తర్వాత వారికి అందిస్తామన్నారు. త్వరలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమవుతున్న సం దర్భంగా అన్ని రూట్లలో బస్సులను నడిపించాలనీ, ఈ విషయంమై ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ అధికారులు ఆర్‌ఎం, డీవీఎం, డిపో మేనేజర్లు ప్రత్యేక శ్రద్ధ్ద వహించాలన్నారు. అనంతరం డిపో పరిధిలోని టిమ్స్ మెషిన్లను పరిశీలించి, బస్సులు ఎన్ని నడుస్తాన్నాయో వాటికి అనుగుణంగా టిమ్ మెషి న్లు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల బస్టాండ్ నుంచి బస్సులు ఏ రూట్లలో ప్ర యాణిస్తున్నాయి, వాటి వివరాలను ఆర్టీసీ అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో ఆర్ ఎం జీవన్ ప్రసాద్, డీటీఓ కిషన్ రావు, డిపో మేనేజర్ జగదీశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.

38

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles