ప్రతి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్


Mon,October 14, 2019 02:52 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : జగిత్యాల ని యోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూ రల్ మండలంలోని చల్‌గల్ గ్రామంలో డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.5.52లక్షలతో ఎస్సీ క మ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆదివారం జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలి సి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ మాజీ ఎంపీ కవిత సహాకారంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామన్నారు. నిరుపేదల పిల్లల చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు. ప్రతి గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాజర్ల గంగారాం గౌడ్, సర్పంచ్ గంగనర్సు, రైతు సమన్వయ సమి తి అధ్యక్షులు ఫయాజ్, ఎల్ల రాజన్న, మోహన్ రెడ్డి, తడగొండ కిషన్, భూమన్న, ఎస్సీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

42

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles