త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు


Sun,October 13, 2019 12:29 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : జిల్లాలో త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై శనివారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో కలెక్టర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరలో ప్రారంభిస్తామనీ, వీటి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గతేడాది కంటే ఈ ఏడాది 50 వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారనీ, దీనికి సంబంధిత పూర్తి వివరాలు అందజేయాలని సూచించారు. గతేడాది 327 కేంద్రా ల్లో కొనుగోలు కేంద్రాలున్నాయి. కొత్త సెంటర్లు ఎక్కడ కావాలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పాత కేంద్రాల్లో పిచ్చిమొక్కలను తొలగించీ, శుభ్రం చేయాలన్నారు. కేంద్రాల్లో తూకం వేసే మిషన్లు పని చేస్తున్నాయా లేవా పరిశీలించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం పరిధిలో ఎన్ని గ్రామాలు వస్తాయో వాటి లిస్టును తయారు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ముందుగానే గన్నీ సంచులు ఎన్నికావాలో చూసుకోవాలనీ, గతేడాది అనుభవాలను దృష్టిలో ఉం చుకుని ముందుగానే వాటిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది ఒకేసారి పంటలు వేసినందున ధాన్యం కూడా ఒకే సారి వస్తుందనీ, అందుకు అనుగుణంగా పాత కేంద్రాలతో పాటు కొత్త కేంద్రాల్లో టార్పాలిన్‌ కవర్లను అం దుబాటులో ఉంచుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. మొక్కజొన్న, పత్తికి కా వాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలన్నారు. కనీస మద్దతు ధర వరి ఏ గ్రేడ్‌కు రూ.18 35, కామన్‌కు రూ.1815 క్వింటాలుకు, మొక్కజొన్న రూ.1760, పత్తికి రూ.5550 నిర్ణయించారన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమం లో జేసీ రాజేశం, వ్యవసాయ శాఖ ఏడీ కల్పన, డీఎం ప్రకాశ్‌, డీఎం సివిల్‌ సైప్లె రజనీకాంత్‌, డీసీఓ రామానుజచారి, అధికారులు పాల్గొన్నారు.


అభివృద్ధి పనులపై సమీక్ష..
మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. జగిత్యాల మున్సిపాలిటీ పనులపై శనివారం కలెక్టర్‌ చాంబర్లో జగిత్యాల శాసన స భ్యులు డాక్టర్‌ సంజయ్‌కుమార్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో కొత్తగా విలీనమైన గ్రామ పంచాయతీల సిబ్బందిని మున్సిపాలిటీల్లోకి తీసుకుని ఆయా గ్రామా ల్లో, మున్సిపాలిటీ పరిధిలోని పారిశుధ్యం పను లు చేయించాలన్నారు. హరితహారంలో భాగంగా వానలు పడుతున్నందున మున్సిపాలిటీల్లో మొ క్కలు నాటాలన్నారు. మున్సిపాలిటీల్లో ఎక్కువ నిధులు లైటింగ్‌, డ్రైనేజీకి కావాల్సిన ఎస్టిమేషన్‌ను తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో చెరు వు కట్టల వెంట ఈతవనాలను పెంచాలన్నారు. రైతు బజార్‌ ఏర్పాటు, రోడ్ల వెడల్పుపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు పాల్గొన్నారు.

44

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles