ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలి


Sun,October 13, 2019 12:28 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : ఆర్టీసీలో కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్‌ మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె ముందు చార్ట్‌ ప్రకారం ఏ విధంగా బస్సులు నడిచాయో, అదే రీతిలో నడపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే పాఠశాలలు ప్రారంభం అవుతున్నందున పాసులు అనుమతించాలని సూచించారు. సంబంధిత డిపోల పరిధిలోని తాసిల్దార్లు విద్యార్థులకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలని సూచించారు. టిమ్‌ వినియోగంపై కండక్టర్లకు ఆదివారం శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ సిబ్బంది కలెక్టర్‌కు తెలిపారు. అలాగే గ్రామాల్లోకి నైట్‌హాల్ట్‌ సర్వీసులు పునరుద్ధరించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో ఎస్పీ సింధూశర్మ, జాయింట్‌ కలెక్టర్‌ బేతి రాజేశం, ఆర్టీఓ కిషన్‌రావు, తాసిల్దార్లు, డీవీఎం, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డిపో మేనేజర్లు పాల్గొన్నారు.

38

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles