గ్రామాల అభివృద్ధే ధ్యేయం


Sun,October 13, 2019 12:28 AM

ధర్మపురి రూరల్‌ : గ్రామాల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ధర్మపురి మండలంలోని ఆరెపల్లి గ్రామంలో డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.4.60లక్షలు, కులసంఘ భవనాల నిర్మాణాలకు రూ.4.60లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు కరీంనగర్‌లోని క్యాంప్‌ కార్యాలయంలో శనివా రం ప్రొసీడింగ్‌ పత్రాలను ప్రజాప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడ ఎంపీటీసీ కుంబాల రవిత రమేశ్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ గ్రామశాఖ అధ్యక్షుడు రేగొండ సాయికుమార్‌ ఉన్నారు.


ఎల్వోసీ అందజేత
గొల్లపల్లి : మండలం తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన షేక్‌ బషీర్‌ అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్య ఖర్చుల కోసం రూ.2లక్షల ఎల్వోసీని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు వైద్య సదుపాయం కల్పించేందుకు సీఎంఆర్‌ఎఫ్‌ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీలోని వ్యాధులకు పలు ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ సర్పంచ్‌ రమేశ్‌, గొల్లపల్లి వైస్‌ ఎంపీపీ ఆవుల సత్యం ఉన్నారు.

27

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles