పట్టుబట్టారు.. కొలువు కొట్టారు


Sun,October 13, 2019 12:28 AM

సారంగాపూర్‌: గ్రామీణ ప్రాంతానికి చెందిన పలువురు యువకులు పట్టుదలతో చదివారు.. కానిస్టేబుల్‌ కొలువులు కొట్టారు. జిల్లాలోని మారుమూల మండలాలైన సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాలకు చెందిన తొమ్మిది మంది యువకులు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. బీర్‌పూర్‌ మండలంలోని బీర్‌పూర్‌, నర్సింహులపల్లి గ్రామాల నుంచి ఇదివరకే చాలామంది యువకులు పోలీస్‌, ఆర్మీ కొలువుల్లో కొనసాగుతున్నా రు. ప్రస్తుతం బీర్‌పూర్‌ మండలంలోని తుంగూర్‌ గ్రామం నుంచే ఏడుగురు కానిస్టేబుల్‌ కొలువులు సాధించారు. కొంతమంది యువకులు 2016లో మొదటిసారి ప్రయత్నించి ఎంపిక కాకపోవడంతో నిరాశ చెందకుండా కష్టపడి చదువుకుని మళ్లీ ప్రయత్నించి కానిస్టేబుల్‌ కొలువులు దక్కించుకున్నారు. బీర్‌పూర్‌ మండలంలోని తుంగూర్‌ గ్రామానికి చెందిన మ్యాడ మనోహర్‌ సివిల్‌, ఆడేపు వినోద్‌ సిటీ సివిల్‌, ఆడెపు రాకేశ్‌ సిటీ సివిల్‌, శీలం నరేందర్‌ టీఎస్‌ఎస్‌పీ, శీలం సత్యం టీఎస్‌ఎస్‌పీ, ఎండీ జావీద్‌ సిటీ ఏఆర్‌, మామిడిపెల్లి రమేశ్‌ టీఎస్‌ఎస్‌పీ విభాగాలకు ఎంపికయ్యారు. మండలంలోని కమ్ముర్‌ గ్రామానికి చెందిన పూదరి కార్తీక్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌గా, సారంగాపూర్‌ మండలంలోని నాగునూర్‌ గ్రామానికి చెందిన సాల్లురి ప్రశాంత్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. బీర్‌పూర్‌ మండలంలోని తుంగూర్‌ గ్రామంలో ఒకే కుంటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు శీలం నరేందర్‌, శీలం సత్యం కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. మొదటి ప్రయత్నంలో 2016లో వీరిద్దరు ఉద్యోగాలకు ప్రయత్నించి విఫలమయ్యారు. అయినా నిరాశ చెందకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువుతూ మళ్లీ ప్రయత్నించి ఇద్దరూ ఎంపికయ్యారు.

41

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles