జగిత్యాల బల్దియాపై గులాబీ జెండా ఎగరాలి


Sat,October 12, 2019 02:19 AM

-ఎన్నికల్లో మున్సిపాలిటీని కైవసం చేసుకొని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు బహుమతిగా ఇవ్వాలి
-పట్టణ రూపురేఖలు మారాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలవాలి
-ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి
-పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
-ఆర్టీసీ కార్మికులపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా


జగిత్యాల రూరల్ : జగిత్యాల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేసి, మున్సిపాలిటీని కైవసం చేసుకొని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు బహుమతిగా ఇవ్వాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సం జయ్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎల్‌జీ గార్డెన్స్‌లో టీఆర్‌ఎస్ పార్టీ నాయకు లు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణ రూపురేఖలు మా రాలన్నా, జగిత్యాల అభివృద్ధి జరగాలన్నా మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్ జెండా ఎగరాలన్నారు. గతంలో ప్రభుత్వంలో ఒక పార్టీ ఉంటే ఎమ్మెల్యే ఇతర పార్టీకి చెందిన వారు ఉండడంతో జగిత్యాల అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉందనీ, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారమేనని, జగిత్యాల మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ కౌన్సిలర్లను గెలిపిస్తే జగిత్యాల అభివృద్ధి జరుగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ ప థకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స మన్వయంతో, సమష్టిగా కృషి చేసి సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయ దుందూబి మో గించేలా పాటుపడాలన్నారు.

దేశంలోని 29రాష్ర్టాల్లోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు అనవసరపు రా ద్ధాంతం చేస్తూ ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టేందు కు యత్నిస్తున్నారన్నారు. విద్యార్థుల కోసం కేం ద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం సాయం చేసిందో చెప్పాలని బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ విద్యార్థుల కోసం హాస్టళ్లలో సన్నబియ్యం, ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఓవర్సీస్ పథకం ప్రవేశపెట్టిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించామన్నారు. పను ల్లో భాగంగా మొదటగా ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీలను వెనక్కి జరిపి రోడ్డు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సైతం జరుగుతున్నాయని పేర్కొన్నారు. జగిత్యాల పట్టణాభివృద్దికి యువత సహకరించాలని కోరారు. యువత కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింద న్నారు.. జగిత్యాల పట్టణం వెలుగులతో విరజిల్లాలనే ఉద్దేశంతో జగిత్యాల పట్టణ ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన టౌన్‌హాల్ పాల ప్యాకెట్లు, సూపర్ మార్కెట్‌కు నిలయంగా మారిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కోటి రూపాయలతో మరమ్మతులు పనులు చేపట్టామన్నారు. 1956లో జగిత్యాల మున్సిపాలిటీగా ఏర్పడిందని, మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే చైర్మన్లుగా ఎన్నికయ్యారన్నారు. గత 30సంవత్సరాల నుంచి మాస్టర్ ప్లాన్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్ రాథోడ్, నాయకులు బోగ వెంకటేశ్వర్లు, బండారి నరేందర్, ఖాజా లియాకత్ మోసిన్, జిఆర్ దేశాయి, వొల్లం మల్లేశం, రంగు గోపాల్, బోగ ప్రవీణ్, అనుమల్ల జయశ్రీ, ప్రభాత్‌సింగ్ ఠాకూర్, కత్రోజు గిరి, ప్రభు పటేల్, కచ్చు లత, తదితరులు పాల్గొన్నారు.

పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై స్వ చ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని జగిత్యాల ఎ మ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్‌ఝఋ గార్డెన్స్‌లో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పట్టణంలోని 29వ వార్డు ఇస్లాంపురకు చెందిన యువకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

జీవన్ రెడ్డి మొసలి కన్నీరు
ఆర్టీసీ కార్మికులు చిన్న కోరిక కోరితే ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటున్నారనీ, మంత్రిగా ఉన్నప్పుడు మీరెందుకు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే సంజయ్ కు మార్ ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు ముఖ్యమం త్రి దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్‌కు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను మంత్రి గా ఉన్నప్పుడు కేసీఆర్ తన ఇంటి చుట్టూ తిరిగారన్నారని అన్నారనీ, ఆనాడు ఉద్యమ నాయకుడు తిరిగితే అప్పటి ప్రభుత్వం ఆర్టీసీని ఎందుకు ఆదుకోలేదని ఆయన విమర్శించారు. ఆర్టీసీలో అద్దె బస్సులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టారా లేదా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఉన్నాయా? అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి ఆర్టీసీపై ఎందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చే శారని అంటున్నారనీ, వైఎస్సార్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకే నెరవేర్చిందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవం తు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ అంజిరెడ్డి, కోకన్వీనర్‌లు కెహెచ్‌పి రావు, ఎంఎస్ పవన్ కుమార్, కెఎ రెడ్డి, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

64

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles