గ్రామాభివృద్ధికి రూ.50 విరాళం


Fri,September 20, 2019 12:36 AM

వెల్గటూరు: మండలంలోని గుల్లకోట గ్రామ అభివృద్ధికోసం ఆ గ్రామానికి చెందిన పొనగంటి నవీన్ (తాసిల్దార్) గురువారం రూ.50 వేలు విరాళంగా అందజేశారు. కాగా ఐదు రోజుల క్రితం 30రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామానికి వచ్చిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు ముందు తాను గ్రామ అభివృద్ధి కోసం రూ. 50వేలు విరాళంగా అందజేస్తానని తెలిపారు. ఈమేరకు ఇచ్చిన మాట ప్రకారం నవీన్ రూ.50 వేల నగదును సర్పంచ్ పొన్నం స్వరూపకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గొల్లపల్లి శ్రీజ, నాయకులు జంగిలి లక్ష్మణ్, పొ న్నం స్వరూప, గొల్లపల్లి మల్లేశం పాల్గొన్నారు.

39

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles