కార్మిక నాయకులకు శిక్షణ


Fri,September 20, 2019 12:36 AM

గొల్లపల్లి : వలసలు, అభివృద్ధి తదితర అంశాలపై ఢిల్లీలో వలస కా ర్మి క నాయకులకు శిక్షణ కా ర్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రవాసీ మిత్ర లే బర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైండ్ల రాజిరెడ్డి తెలిపారు. ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి సైండ్ల రాజిరెడ్డి ఈ నెల 23నుంచి 26వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఢిల్లీ సమీపంలోని నోయిడాలోని వీవీగిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగే శిక్షణ కార్యక్రమం లో పాల్గొననున్నారు. గొల్లపల్లి మండలం ద మ్మన్నపేటకు చెందిన రాజిరెడ్డి సౌదీ నుంచి తి రిగి వచ్చి వలస కార్మికుల హక్కుల సాధన కో సం యూనియన్‌ను స్థాపించారు. యూనియ న్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల సైతం శిక్షణలో పాల్గొననున్నారు. వలసలు, అభివృద్ధి, సమస్యలు తదితర అంశాలపై దేశంలోని ప్రముఖ విశ్వ విద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, నిపుణులు వీరికి శిక్షణనిస్తారు.

36

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles