రసవత్తరంగా కిక్ బాక్సింగ్ పోటీలు


Fri,September 20, 2019 12:36 AM

కరీంనగర్ స్పోర్ట్స్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌స్టేడియంలో జాతీయస్థాయి కెడెట్, జూనియర్ కిక్ బాక్సింగ్ పోటీలు మూడో రోజు రసవత్తరంగా సాగాయి. నువ్వా.. నేనా అన్న రీతిలో క్రీడాకారులు పోటీపడ్డారు. వాకో ఇండియా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన పోటీలను గురువారం జాతీయ అధ్యక్షుడు సంతోష్ ఆగర్వాల్ ప్రారంభించారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించగా, మహారాష్ట్ర క్రీడాకారులు అధిక సంఖ్యలో విజేతలుగా నిలువగా రెండవస్థానంలో ఆతిథ్య తెలంగాణ, మూడో స్థానంలో హర్యాన క్రీడాకారులు నిలిచారు. కిక్ బాక్సింగ్‌లోని పాయింట్ ఫైట్, లైట్ కంటాక్ట్స్, మ్యూజికల్ ఫామ్, పుట్ కాంటాక్ట్, కిక్‌లైట్, వెపన్ తదితర విభాగాల్లో పోటీలు జరిగాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జూనియర్ ఇండియా కిక్ బాక్సింగ్ శిబిరానికి ఎంపిక చేయనున్నారు. యోగా హాల్‌లో నిర్వహిస్తున్న మ్యూజికల్ ఫాం, సాఫ్ట్‌ైస్టెల్, హార్డ్‌ైస్టెల్ పోటీల్లో హర్యానా, సిక్కీం రాష్ర్టాలకు చెందిన సత్తా చాటారు. అత్యధిక సంఖ్యలో పతకాలు సాధించిన రాష్ర్టానికి ఓవరాల్ చాంపియన్‌షిప్‌కు బంగారు, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి సిల్వర్, కాంస్య పథకాలతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలో ప్రోత్సాహక బహుమతులు నిర్వాహకులు టోర్నమెంట్ చైర్మన్ శ్రీనివాస్, చీఫ్ ఆర్గనైజర్ ప్రసన్నకృష్ణ, వైస్ చైర్మన్ మాడుగుల ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. కాగా, పోటీలు శుక్రవారంతో ముగుస్తాయని పేర్కొన్నారు.

39

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles