బాలిక సాధికారిత క్లబ్బుల ఏర్పాటు


Thu,September 19, 2019 01:00 AM

జగిత్యాల టౌన్ : జిల్లాలో ఎంపిక చేసిన 12 ఉన్నత పాఠశాలల్లో, 14 కేజీబీవీలలో బాలిక సాధికారిత క్లబ్బులను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాధికారి ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నా రు. జిల్లా కేంద్రంలోని గ్రావిటీ పాఠశాలలో బుధవారం ప్రధానోపాధ్యాయులకు, స్కూల్ అసిస్టెంట్లకు ఒక రోజు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ విద్యార్థినులు మానసిక, శారీరక, ఆ రోగ్యపరమైన రక్షణ ఏ విధంగా చేసుకోవాలో వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ పీ సింధుజ, సీడీపీఓ అరవింద, డీసీపీఓ యం. హరీశ్, ఎన్‌జీఓ టీ శ్రీనివాస్, సఖి కో-ఆర్డినేటర్ వీ మనీల, కోర్స్ కో-ఆర్డినేటర్ యం. రా జేశం, ఎస్‌ఓ బాలకిషన్, ఆర్‌పీ జీ భూపతి, నాగ సుధారాణి, సులోచన, 26 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

42

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles