ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలి


Thu,September 19, 2019 01:00 AM

మల్యాల : గ్రామ పంచాయతీ ప్రత్యేక అభివృద్ధిలో భాగంగా 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్ర ణాళికను గ్రామ పంచాయతీల పరిధిలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్ అన్నారు. మల్యాల మండలంలోని ము త్యంపేట గ్రామంలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో చొప్పదండి నియోజక వర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాల ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులతో 30రోజుల ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మల్యాల మండలంలో ని మల్యాల, బల్వంతాపూర్, మానాల, లంబాడిపల్లి, మద్దుట్ల, కొడిమ్యాల మండలంలోని పూడూ రు, డబ్బుతిమ్మాయపల్లి, రాంసాగర్, హిమ్మత్‌రావుపేట గ్రామాల ప్రత్యేక కార్యాచరణపై గ్రామ కా ర్యదర్శులు, గ్రామ ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్‌లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రా మాల్లో 30రోజుల ప్రణాళికలో భాగంగా గుర్తించిన పనుల పురోగతిపై సమీక్షిస్తున్నామన్నారు. పనులు 30రోజుల కార్యాచరణను అనుగుణంగా పూర్తి చేయాలన్నారు. పలు గ్రామ పంచాయతీల పరిధిలలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సరిగా నిర్వహించడం లేదని తనకు సమాచారం అం దిందనీ, ఇప్పటికైనా అలసత్వం వీడి పనులపై శ్రద్ధ చూపి పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు. గ్రామాలకు పట్టిన పీడను వదిలించుకోవాలంటే డ్రైనేజీ, పిచ్చిమొక్కలు, భవనాలు, బోర్లు, చెత్తా, రోడ్డుపై గుంతలు, దోమలు, ఈగలను నివారించి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఐదుసార్లు ఓరియంటేషన్ కార్యక్రమాలు చేపట్టామనీ, ఈ విధంగా రాష్ట్రంలోని ఏ జిల్లాలో సైతం నిర్వహించలేదన్నారు.


కనీసం 30రోజుల్లో డ్రైనేజీని శుభ్రం చేయాలని సూచించారు ప్రధాన రహదారుల గుండా ఎవె న్యూ ప్లాంటేషన్‌ను పూర్తి చేయాలనీ సూచిం చారు. ప్రధాన రహదారుల గుండా మొక్కలు నా టాలనీ, ఎప్పటికప్పుడు పిచ్చిమొక్కలను తొలగించాలని సూచించడంతో పాటు మళ్లీ వచ్చే వారంలోపు మండల కేంద్రాలకు ప్రధాన రహదారుల ద్వారా మొక్కలు కనిపించాలని సూచించారు. ఒక్కో మొక్కను 7నుంచి 8ఫీట్ల సైజులో మొక్కలు నాటడంతో పాటు 8నుంచి 9ఫీట్ల ట్రీగార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రీగార్డుల వినియోగంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథం కింద రూ.120 అందజేస్తున్నామనీ, ట్రీగార్డు కొ నుగోలు విషయంలో డూప్లికేట్, అసెంబుల్డ్ కాని వాడవద్దని, ఐఎస్‌ఐ బ్రాండ్ కలిగినవి మాత్రమే వినియోగించాలన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో నాటిన మొక్కలు 85శాతం బతికేలా గ్రామ పంచాయతీ బాధ్యతలు తీసుకోవాలనీ, లేదంటూ సర్పంచులతోపాటు గ్రామ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామన్నారు. కోతుల కోసం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మంకీ ఫుడ్‌కోట్‌లను ఏర్పా టు చేయాలని, ఒక్కో గ్రామ పంచాయతీలో 500 మొక్కలకు తగ్గకుండా హరితహారంలో మొక్కలను నాటాలని, మద్ది, జువ్వి, నేరేడు, సీతాఫలం, అల్లనేరేడు తదితర 18రకాల పండ్ల మొక్కలను నాటాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను, కమ్యూనిటీ ప్లాంటేషన్, బండింగ్ ప్లాంటేషన్‌ను పెంపొందించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. 30రోజులకు అనుగుణంగా జిల్లాస్థాయిలో షెడ్యూల్ రూపొందించామనీ, వాటికి అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు గ్రామ పం చాయతీ స్థాయిలో ప్లాస్టిక్‌ను పోగు చేసి మండల స్థాయిలో ఒక స్టాక్ పాయింట్‌ను ఏర్పాటు చేసి రీ సైక్లింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామ న్నా రు. గ్రామ పంచాయతీల ఆర్థిక స్థితిగతులను బట్టి ట్రాక్టర్‌ను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంద నీ, ట్రాక్టర్లు రూ.1.50లక్షల నుంచి రూ.15లక్షల విలువ గల ట్రాక్టర్లు సైతం అందుబాటులో ఉన్నాయనీ, గ్రామ పంచాయతీల స్థితిగతులను బట్టి వ్యవసాయ అధికారుల సలహాలతో ట్రాక్టర్లను కొ నుగోలు చేసుకోవాలన్నారు.

గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేక కార్యాచరణలో భాగంగా కోఆప్షన్‌ల నియామకంతోపాటు వీధి దీపాల కోసం ప్ర త్యేక కమిటీ, నిధుల వెచ్చింపు కోసం ప్రత్యేక కమి టీ, హరితహారం కోసం ప్రత్యేక కమి టీ, పారిశు ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీల ను నియమించుకున్నామనీ, ఒక్కో గ్రామ పంచాయతీ ప రిధిలో పాలకవర్గ సభ్యులతోపాటు కమిటీ సభ్యులను కలుపుకుంటే సుమారు వంద మం దికి పైగా ఉన్నారని, వీరంతా కలిసి స్థాని క ప్రజాప్రతినిధులను, ప్రజలకు 30రోజుల కార్యాచరణపై అవగాహన కల్పించి పనుల్లో భాగస్వాములను చేయాలన్నారు. మండలంలోని అప్పారావుపేట, చింతలపల్లి, మల్యాల మండలంలోని గుడిపేట, గొర్రెగుండం, పోతారం గ్రామాలకు డంపిం గ్ యార్డుల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఆయా తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మంగళవారం ఆయా గ్రామ పంచాయతీలలో శ్రమదానం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ భిక్షపతి, డీఎఫ్‌వో నర్సింహా రావు, డీపీవో శేఖర్, జిల్లా పరిషత్ ఏవో శ్రీలతా రెడ్డి, ఏపీడీలు లక్ష్మీనారాయణ, సుందర వరద రాజన్, పీఆర్‌ఈఈ రాజమనోహర్ రెడ్డి, తహసీల్దార్‌లు శ్రీనివాస్, పద్మావతి, ఎంపీడీవోలు సుధాకర్, రమేష్, ఈవోపీఆర్డీలు, ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

47

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles