జిల్లాలో మోస్తరు వర్షం


Thu,September 19, 2019 12:59 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో పెగడపల్లి మండలంలో అత్యధికంగా 83.4మిల్లీ మీటర్ల వర్షపా తం నమోదు కాగా , గొల్లపల్లి మండల కేంద్రంలో 76.2 మిల్లీ మీటర్లు నమోదైంది. రాయికల్‌లో 38.4, ధర్మపురిలో 16, సారంగాపూర్‌లో 29.6, మల్యాలలో 52, జగిత్యాలలో 70, కొడిమ్యాలలో 49, వెల్గటూర్‌లో 68.6, కోరుట్లలో 30, మేడిపల్లిలో 60, ఇబ్రహీంపట్నంలో 68, కథలాపూర్‌లో 42.6, మ ల్లాపూర్‌లో 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంలోని జెండామైలాలో అయూబ్‌ఖాన్‌కు చెందిన ఇల్లు కూలిపోయింది.
పెగడపల్లి: మండలంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వరి పొలాలు, మక్క జొన్న పంటలకు కొంత మేర నష్టం సంభవించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. పెగడపల్లి, మద్దులపల్లి, లింగాపూర్, ఐతుపల్లి, వెంగళాయిపేట చెరువుల్లోకి భారీగా వరద నీరు వస్తుండడంతో చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి. వాగులు, ఒర్రెల్లో వరద నీరు పారుతున్నది.

43

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles