ప్రభుత్వ వైద్య సేవలు భేష్


Wed,September 18, 2019 02:43 AM

-ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రధాన లక్ష్యం
-జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత
-జిల్లా ప్రధాన వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ
జగిత్యాల అర్బన్ : జగిత్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు భేషుగ్గా ఉన్నాయని జిల్లా జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత కితాబిచ్చారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిని జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతసురేష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా ఆసుపత్రిలోని ఔట్, ఇన్ పేషంట్, ప్రసూతి వార్డు, ఇంక్యుబేటింగ్ విభాగాలతో పాటు పలు విభాగాలను త నిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం జడ్పీ అధ్యక్షురాలు వసంత మట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారనీ, సీఎం ఆలోచనకు అనుగుణంగా ప్రధానాసుపత్రిలో వైద్యులు సేవలు అందించడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వాల హ యాంలో ఆసుపత్రికి రావాలంటేనే ముక్కు మూ సుకొని వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవనీ, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్, మాతా శిశి సంరక్షణ కేంద్రం, ఇతర వైద్య సేవలు అభివృద్ధి చెందాయన్నారు.ప్రతి నిత్యం 300 నుంచి 900 వరకు ఓపీ సేవలను అందించే స్థాయికి జిల్లా ఆసుపత్రి వచ్చిందన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో సైతం పారిశుధ్యంపై దృష్టి సారించాలన్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు చాలా బాగున్నాయని ఆ సుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులే స్వయం గా తెలిపారనీ, ఈ నమ్మకాన్ని నిలబెట్టేందుకు వైద్యులు తమ పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఏఓ శ్రీలతారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ సుదక్షణాదేవి, ఆర్‌ఎంఓ రామకృష్ణ, వైద్యులు జం గిలి శశికాంత్, ఒడ్నాల రజిత పాల్గొన్నారు.

60

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles