30 రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయండి


Wed,September 18, 2019 02:42 AM

మల్యాల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గ్రామ పంచాయతీల ప్రత్యేక అభివృద్ధి కోసం చేపట్టిన 30 రోజుల ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయాలంటూ జిల్లా పరిషత్ ఏఓ శ్రీలతారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మల్యాల మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయితీల ప్రత్యేకాధికారులతో పాటు గ్రామ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందికి మండ ల ప్రత్యేకాధికారి రాజమనోహర్‌రెడ్డితో కలసి 30 రోజుల ప్రణాళికకు సంబందించిన అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ ఏఓ శ్రీలతారెడ్డి మాట్లాడు తూ గ్రామ పంచాయతీల్లో అభివృధ్ధి చెందేందుకు గానూ 30 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేసేందుకు గానూ నిధులను వెచ్చిస్తుందన్నారు. గ్రామ స్థాయిలో ప్రత్యేకాధికారుల ను నియమించి ఆయా గ్రామాల పరిధిలో కో-ఆప్షన్ సభ్యుల నియామకం, ప్రత్యేకంగా కమిటీల ను నియమించుకున్నారని ఆ కమిటీ సభ్యుల ద్వా రా ప్రజలను భాగస్వాములు అయ్యేలా చొరవ చూపాలని అన్నారు. జిల్లా పరిధిలో 30 రోజుల కార్యచరణకు గానూ ప్రత్యేకంగా షెడ్యూల్‌ను రూ పొందించామనీ, షెడ్యూల్‌కు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో చేపట్టిన ప్రతీ పనిని ప్రతినిత్యం ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు. 30 రోజుల ప్రణాళికను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. మండలంలోని ప్రతీ గ్రా మ పరిధిలో జరిగిన అబివృధ్ది పనులపై సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బండి సుధాకర్, ఈవోపీఆర్‌డీ సారయ్య, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

55

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles