ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు


Wed,September 18, 2019 02:42 AM

సారంగాపూర్: సౌదీ ముఖ్య పట్టణం రియాద్‌లో మంగళవారం సారంగాపూర్ మండల కేం ద్రానికి చెందిన ఉరుమల్ల నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో మోడీ అభిమానులు జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. కేక్ కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లో బీజే పీ నాయకులు నరెంద్ర మోడీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. మండలంలో మండల నా యకులు ఎండబెట్ల వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని లోని లక్ష్మిదేవిపల్లి పంచాయతి పరిధిలోని నాయకపు గూడెంలో వరుణ్ కుమార్ 50 మంది మహిళలకు చీరెలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు, కా ర్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల రూరల్ : మండలంలోని తాటిపెల్లి గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడు కలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు పూదరి శ్రీనివాస్ పాఠశాలలో చదువు తున్న 120 మంది విద్యార్థులకు పుస్తకాలు, పె న్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వి నోద్, రాజేశ్, శేఖర్, నరేశ్, కళ్యాణ్ పాల్గొన్నారు.
రాయికల్ రూరల్ : రాయికల్ మండంలో బీజేపీ శ్రేణులు యువజన విభాగం ఆధ్వర్యంలో కేక్ కోసి మిఠాయిలు పంచిపెట్టారు. కి చెందిన పూర్వ విద్యార్థులు, బీజేపీ నాయకులు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, ప్లేట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఉడుత సురేశ్, సోమేష్, దువ్వాక నరేష్, బొప్పా రపు నరేశ్, కొడిమ్యాల శేఖర్, కొరుకొండ రమేశ్, దూకంటి గంగారెడ్డి, కొత్తపెల్లి మహేశ్, ఉడుత సంతోష్, పారిపెల్లి గంగాధర్ పాల్గొన్నారు.

46

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles