ప్రణాళికపై అలసత్వం వద్దు


Wed,September 18, 2019 02:41 AM

కోరుట్ల/కోరుట్లటౌన్: పల్లెల ప్రగతి వికాసం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30 రోజుల కార్యచరణ ప్రణాళికపై అలసత్వం చూపవద్దని కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. కార్యాచరణ పనుల అమలుపై కోరుట్ల నియోజకవర్గస్థాయి అ ధికారులకు మంగళవారం పట్టణంలోని కటుకం సంగయ్య ఫంక్షన్ హల్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకోవాలన్నారు. గ్రామాల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం రిజిస్టర్లను ఏర్పాటు చేసుకొని పనుల వివరాలను పొందుపర్చాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బా ధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న కట్టడాలను కూల్చివేయాలనీ, ప్ర జా ప్రతినిధులు, స్టాండింగ్ కమిటీ, కో-అప్షన్, యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తుల సహకారంతో శ్రమదానం నిర్వహించి పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు. పాడుబడ్డ బావులు, చెడి పోయిన బోర్లను పూడ్చి వేయాలన్నారు. అం తకుముందు గ్రామ ప్రత్యేకాధికారు లు, పంచాయతీ కార్యదర్శులను వివరాలు అడిగి తెలుసుకొ ని పనుల్లో అలసత్వంపై పలువురు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పనులను నిబద్ధతతో పూర్తి చేయిస్తామని అధికారులతో ప్ర తిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గౌ తమ్ పొత్రూ, జిల్లా పంచాయతీ అధికారి శేఖర్, డీఆర్‌డీవో భిక్షపతి, ఏపీడీవో లక్ష్మీనారాయణ, మైనార్టీ జిల్లా అధికారి సుందరవరదరాజన్, జిల్లా ఫారెస్ట్ అధికారి నర్సింగరావు, ఎంపీడీవో, ఎమ్మార్వో, వివిధ శాఖల అధికారులున్నారు.

34

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles