పల్లెల సమగ్రాభివృద్ధికే ప్రణాళిక


Tue,September 17, 2019 02:46 AM

పెగడపల్లి : పల్లెల సమగ్రాభివృద్ధికే ప్రభుత్వం 30 రోజుల ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎంపీపీ గోళి శోభ, జడ్పీటీసీ సభ్యుడు కాసుగంటి రాజేందర్‌రావు అన్నారు. సోమవారం మ్యాకవెంకయ్యపల్లి గ్రామంలో అధికారులు, గ్రామస్తులతో కలిసి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, శ్రమదానంతో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. అనంతరం ఆయా వార్డుల్లో తిరుగుతూ స్థానికులను అడిగి సమస్యలపై ఆరా తీశారు. గ్రామంలోని ప్రధాన రహదారి వెంట ప్రమాదకరంగా ఉన్న వ్యవసాయ బావి వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని కోరగా, గోడ నిర్మించాలని అధికారులకు సూచించారు. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువలు లేక నీరంతా రోడ్లపై పారుతుందనీ, అలాగే రోడ్డు ఇరుగ్గా ఉండడంతో ఇబ్బందులుపడుతున్నామని అధికారులు, నాయకులకు సమస్యను వివరించారు. సాధ్యమైనంత త్వరలో వాటిని పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ ఇనుకొండ లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ, జడ్పీటీసీ మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకోడంతో పాటు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పనులకు నిధుల కొరత లేదనీ, తక్షణమే అత్యవసర పనులు చేపట్టాలని సూచించారు. తాసిల్దార్ సరిత, ఎంపీడీఓ వాసాల వెంకటేశ్, ఎంపీఓ బీమ జయశీల, ఎస్‌ఐ జీవన్, డీటీ సమ్మయ్య, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ఇనుకొండ మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఆవాల అర్జున్‌రెడ్డి, నాయకులు గోలి సురేందర్‌రెడ్డి, రమణాకర్, బండి వెంకన్న, ఆవాల లింగారెడ్డి, నామ సురేందర్‌రావు, రాజు ఆంజనేయులు, తిర్మణి రమణారెడ్డి, పులి రాజేశం పాల్గొన్నారు.

45

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles