పచ్చదనం పరిరక్షణకు కృషిచేయాలి


Tue,September 17, 2019 02:46 AM

మేడిపల్లి : పచ్చదనం, పరిశుభ్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జలశక్తి అభియాన్ కేంద్ర బృందం సభ్యుడు విపిన్‌చంద్ర సూచించారు. మేడిపల్లి మండలం కొండాపూర్‌లోని ఎకరం ప్రభుత్వ భూమి లో సర్పంచ్ ద్యావనపెల్లి అభిలాష్ 250 టేకు మొక్కలను నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేయగా, వాటిని స భ్యులు విపిన్‌చంద్ర, కార్తికేయ, దశరథ్ ప్రసాద్ పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోర్‌వెల్ రీచార్జ్‌ను, గ్రామసభ రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం మేడిపల్లి మండలంలోని కట్లకుంట, తోంబర్‌రావుపేటను సభ్యులు సందర్శించి జలశక్తి అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. రీచార్జి బోర్‌వెల్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గడ్డం నారాయణరెడ్డి, మామిడి సత్తవ్వ, ఎంపీటీసీలు పన్నాల లావణ్య, మ్యాకల రాజు, డీఆర్‌డీఏపీడీ భిక్షపతి, డీఎల్‌పీఓ కీర్తిప్రసాద్, ఏపీడీలు ల క్ష్మీనారాయణ, సుందరవరదరాజన్, ఎంపీడీఓ పద్మ జ, సూపరింటెండెంట్ రవీందర్, ఏపీఓ శ్రీనివాస్, ఈ సీ ప్రవీణ్, టీఎస్ తులసీదాస్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మల్లాపూర్: మల్లాపూర్ మండల కేంద్రంతో పాటు, రాఘవపేట గ్రామంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం లో భాగంగా సోమవారం కేంద్ర బృందం కమిటీ స భ్యులు బిపిన్ చంద్ర ఆధ్వర్యంలో గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా మల్లాపూర్ మండల కేంద్రంలోని పెద్దచెరువు, పితిరికుంటలను పరిశీలించి చెరువుల్లోని నీటి సామర్థ్యం, లోతు, నీటిని పంటలకు వాడే విధానం, పంటల సాగు విస్తీర్ణం తదితర అంశాలపై స్థా నిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాఘవపేటలో కమ్యూనిటీ నీటి గుంతలను పరిశీలించారు. ఇ క్కడ బృందం డైరెక్టర్లు దశరథ్ ప్రసాద్, కార్తికేయన్, డీఆర్డీఓ భిక్షపతి, అడిషనల్ పీడీ లక్ష్మీనారాయణ, డీవీ ఓ చిన్నయ్య, ఎంపీఓ భీమేష్‌రెడ్డి, ఏఈ అరుణోదయ్, ఏపీఓ సతీష్, ఈసీ నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.
కథలాపూర్: కథలాపూర్ మండలం తాండ్య్రాల, కథలాపూర్ గ్రామాల్లో జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా చేపట్టిన పనులను కేంద్ర అధికారుల బృం దం సోమవారం పరిశీలించింది. కథలాపూర్‌లో క మ్యూనిటీ హాల్‌లో నిర్మించిన ఇంకుడు గుంతలను, గ్రామశివారులో నాటిన మొక్కలను పరిశీలించారు. తాండ్య్రాలలో మిషన్‌కాకతీయ పథకంలో మరమ్మతులు చేసిన ఊరచెరువును పరిశీలించారు. గ్రామపంచాయతీ సమీపంలో నిర్మించిన ఇంకుడు గుంతలను, బోర్‌బావుల రీచార్జి గుంతలను పరిశీలించి స్థానికుల తో మాట్లాడారు. కేంద్ర బృందం అధికారులు బిపిన్ చంద్ర, కార్తికేయ, దశరథ్, డీఆర్డీ భిక్షపతి, ఏపీడీలు సుందరవరదరాజన్, లక్ష్మీనారాయణ, ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ జనార్దన్, ఈసీ లక్ష్మయ్య, సర్పంచులు కంటె నీరజ, గడిల గంగాప్రసాద్, కిరణ్‌రావు, పంచాయతీ కార్యదర్శి చెదలు నారాయణ, దేవేందర్, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

37

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles