సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం


Tue,September 17, 2019 02:46 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో సాధారణ చర్చ సందర్భంగా వెల్లడించిన ప్రభుత్వ వైఖరి అంశాలు హర్షణీయని టీబీసీ ఐకాస రాష్ట్ర అ ధ్యక్షుడు హరి అశోక్ కుమార్ సంఘం తరపున హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామని, రుణ మాఫీ చేసి తీరుతామని, నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చే ది లేదన్నారని గుర్తు చేశారు. త్వరలో కొత్త ఫించనుదారులందరికి ఫించన్లు ఇస్తామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులు విదేశీ చదువులు అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ లను రూ10 లక్షలనుంచి రూ.25లక్షలు చేసామన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ చర్చకు ఇచ్చిన సమాధానాలు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బండారి వియ్, సింగం భాస్కర్, పంబాల రాంకుమార్, ప్రకాశ్ రావు, కస్తూరి శ్రీమంజ రి, విజయలక్ష్మి, రవి కుమార్, నర్సింహాచారి, మహేశ్, అలిశెట్టి ఈశ్వరయ్య, హన్మాం డ్లు, శేఖర్, లైశెట్టి వెంకటి, కిశోర్ కుమార్ పాల్గొన్నారు.

40

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles