ఓటర్లు తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలి


Tue,September 17, 2019 02:45 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : ఓటరు జాబితాలో ఓటర్లు తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని జగిత్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ బేతి రాజేశం సూచించారు. ఓటర్ల జాబితా పరిశీలనపై సోమవారం స్థానిక ఐఎంఏ హాల్‌లో జిల్లాలోని తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ బేతి రాజేశం మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరూ nvsp.in వెబ్‌సైట్ ద్వారా తమ ఓటుతో పాటు వారి కుటుంబ సభ్యుల పేర్లను కూడా పరిశీలించుకోవాలన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే పిటిషనర్లు సెల్ నెంబర్ తీసుకుని విధిగా మండల కార్యాలయంలో పరిశీలించుకోవాలన్నారు. జిల్లా అధికారులు తమతోపాటు కుటుంబ సభ్యుల యొక్క ఓటరు వెరిఫికేషన్ చేసుకోవాలనీ, కోరుట్లలో ఓటర్ వెరిఫికేషన్ కోసం ఐదు కంప్యూటర్లతో ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల కార్యాలయానికి వచ్చిన ప్రజలకు వారి యొక్క స్మార్ట్ ఫోన్ ద్వారా చూసుకునేలా వారికి అవగాహన కల్పించాలనీ, ఈఆర్‌ఓలు, ఎఈఆర్‌ఓలు తప్పక ఓటరు వెరిఫికేషన్‌లో అందరు భాగస్వామ్యం అయ్యే లా చూడాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ అరుణశ్రీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

40

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles