జ్యేష్టాదేవికి వీడ్కోలు


Mon,September 16, 2019 12:58 AM

ధర్మపురి,నమస్తే తెలంగాణ: ధర్మపురి పట్టణంలో జ్యేష్టాదేవి (బొడ్డెమ్మ) నిమజ్జన వేడుకలను ఆనందోత్సాహాల నడుమ మహిళలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ధర్మపురి క్షేత్ర సంప్రదాయం ప్రకారం సోదరీమణులైన జ్యేష్టాదేవి, లక్ష్మీదేవీలకు పక్షం రోజుల తేడాతో పూజలు చే సి ఘనంగా వేడుకలు జరుపుకొని సాగనంపుతారు. జ్యేష్టాదేవి అంశగా బొడ్డెమ్మను భావిం చి పక్షం రోజుల పాటు పూజించి సా గనంపనిదే లక్ష్మీదేవిని సాగనంపరాదనే సంప్రదాయం క్షే త్రంలో ఆదినుంచీ వస్తున్నది. ఈ మేరకు జ్యే ష్టాదేవిని పొలాల అమావాస్య రోజున బొజ్జవారిగద్దె వద్ద మట్టితో తయారు చేసి నెలకొల్పా రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పక్షం రోజుల పాటు అమ్మవారికి నివేదనలు, పూజలు చేశా రు. ఆదివారం బొజ్జవారి గద్దె వద్ద బాహ్మణ మహిళలంతా పూజాకార్యక్రమంలో పాల్గొని సామూహిక భోజనాలు చేసి సాయంత్రం వేళ వివిధ రకాల పూలతో అలంకరించిన బతుమ్మల మధ్య అమ్మవారి ప్రతిమను ఉంచి కోలాటాలు, బాజాభజంత్రీలతో నృత్యం చేస్తూ వేడుకలు జరుపుకొన్నారు. అనంతరం బొడ్డెమ్మను నెత్తిన పెట్టుకొని శోభాయాత్రగా గోదావరి వర కు వెళ్లి నిమజ్జనం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనీ ధర్మపురి క్షేత్ర సంప్రదాయం ప్రకారం ఈ నెల 28న చంద్రశేఖర ఆలయం (పెద్దమ్మవారి గద్దె వద్ద) లక్ష్మీదేవి అమ్మవారి అంశగా బొడ్డెమ్మను భావించి నెలకొల్పి పక్షం రోజుల పాటు పూజలు చేస్తారు.

38

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles