కోతుల పునరావాసానికి విరాళం


Mon,September 16, 2019 12:58 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ: ధర్మపురిలో కోతుల బెడద నివారణ కోసం ధర్మపురికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గొల్లపెల్లి గణేశ్ కోతుల పునరావాసం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణ వాసుల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుండగా.... 1990 ఎస్సెస్సీ మిత్రబృందం సభ్యుల ఆధ్వర్యంలో రూ. 36,500ను జమచేసి విరాళంగా అందజేశారు. ధర్మపురి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1989-90 విద్యా సంవత్సరంలో ఎస్సెస్సీ చదువుకున్న పూర్వ విధ్యార్థులు సమావేశమై డబ్బులను జమచేసి విరాళంగా అందజేశారు. ఇక్కడ మిత్రబృందం సభ్యులు రంగు లక్ష్మీనరహరి, ప్రశాంత్, దొంతుల శ్రీధర్, సునీల్, హరినా థ్, సాంబమూర్తి, ఇందారపు హరినాథ్, కూరగాయల రమేశ్, గంగరాజం, రాజలింగం, రాజేందర్, రాంకిషన్, సాగర్, జయప్రద, ప్రశీణ, నీలిమ తదితరులు పాల్గొన్నారు..


కోతులను అడవికి తరలింపు
మారుతీనగర్ : మెట్‌పల్లి మండలంలోని వేంపేట గ్రామస్తులు కొంతకాలం గా కోతుల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు గ్రామాభివృద్ధ్ది కమిటీ ఆధ్వర్యంలో కూలీలను ఏర్పాటు చేసి కోతులను పట్టి అడవికి తరలించారు. కాగా గ్రామంలో 1150 ఇండ్లుండగా ప్రతి ఇంటి నుంచి చందాలను వసూలు చేసి వీడీసీ వారు కోతులను పట్టే కూలీలను ఏర్పాటు చేసి 270 కోతులను పట్టుకొని అడవికి తరలించారు.

48

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles