చలో నిజామాబాద్‌ను జయప్రదం చేయాలి


Sun,September 15, 2019 01:02 AM

మెట్‌పల్లి,నమస్తేతెలంగాణ: బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 16న తలపెట్టిన చలో నిజామాబాద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుతారి రాములు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో చలో నిజామాబాద్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీడీ కార్మికులకు ఆన్‌లైన్‌లో ఆధార్ అనుసంధానం శాపంగా మారిందన్నారు. ఈపీఎఫ్ బీడీ కార్మికులకు రూ.6వేలు అమలు చేయాలనీ, కార్మికులు కష్టపడితే వచ్చిన డబ్బుల నుంచి ప్రావిడెంట్ ఫండ్‌కు జమ చేసి, ఆ తర్వాత ఎగ్గొట్టే ఆలోచనను కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి కార్మిక శాఖ యత్నిస్తున్నదని విమర్శించారు. ఈ నెల 16న నిజామాబాద్‌లోని పీఎఫ్ కార్యాలయం ఎదుట ఉదయం 11గంటలకు మహాధర్నా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నాయకులు ఎండీ ముక్రాం, ఎండీ అజారుద్దీన్, చిలకయ్య, మార్గం రాజలింగం తదితరులున్నారు.

49

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles