నలందలో బీకాం ఫ్రెషర్స్‌డే వేడుకలు


Sun,September 15, 2019 01:02 AM

జగిత్యాల లీగల్: జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో శనివారం బీకాం విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీ కామర్స్ విభాగాధిపతి, యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ప్రధానాధికారి హరికాంత్ మాట్లాడుతూ.. విద్యార్థులకు అనేక రకాల ఉపాధి అవకాశాలున్నాయనీ, శ్రద్ధగా చదవాలన్నారు. జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థులకు సేవాభావం అలవడుతుందన్నారు. ఇది సమసమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేశ్ మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా విద్యార్థులకు అనేక రకాల ఉత్తమ విలువలు అలవడుతున్నాయనీ, బీకాం ద్వారా అనేక రకాల ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థి శివనీతి రాజశేఖర్ ఎస్‌ఐ ఉద్యోగానికి, నరేశ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఎన్నిక కాగా కళాశాల తరఫున హరికాంత్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

40

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles