పోషణ అభియాన్‌పై అవగాహన

Sat,September 14, 2019 02:45 AM

సారంగాపూర్ : మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో స్వశక్తి సం ఘాల సభ్యులకు శుక్రవారం పోషణ అభియాన్, ఎస్‌ఎస్‌జీ ఓటింగ్, మహిళా సంఘాల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా సెర్ప్ డీపీఎం ఐబీ సుగంధ మాట్లాడుతూ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళల ఆరోగ్యం, చేతుల పరిశుభ్ర త, పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం, తదితర అంశాలపై అవగాహన క ల్పించారు. మహిళలతో పోషణ అభియాన్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఎస్‌ఎస్‌జీ ఓటింగ్‌పై మహిళలకు అవగాహన కల్పించారు.


పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
రాయికల్ రూరల్ : చిన్న వయసు నుంచే పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో ఎదుగుతారని ఎంపీ పీ లావుడ్య సంధ్య తెలిపారు. మండలం కట్కాపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం పోషకాహారాల ప్రదర్శన, పిల్లలకు అన్నప్రాసన చేశారు. గర్బిణులకు సీమంతం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ము ద్దసాని రాజమౌళి, ఐసీడిఎస్ సూపర్‌వైజర్ సుభద్ర పాల్గొన్నారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles