ఇంటికో మొక్క

Sat,September 14, 2019 02:43 AM

జగిత్యాల టవర్ సర్కిల్ : ఇంటికో మొక్క నాటాలని కలెక్టర్ శరత్ ఇచ్చిన పిలుపు మేరకు హౌసింగ్ బోర్డు కాలనీ వాసురాలు ముందుకు కదిలారు. ఇంటికో మొక్క అందిస్తూ హరితహారం స్ఫూర్తిని చాటుతు న్నారు. వారం రోజుల క్రితం కలెక్టర్ శరత్ హౌసింగ్ బోర్డు కాలనీలో పర్యటించి ఇంటికో మొక్క నాటాలని పిలుపునిచ్చారు. దీంతో స్పం దించిన కాలనీ వాసురాలు కొండ రేవతి తన కిట్టీ పార్టీ ఫ్రెండ్స్, కాలనీ వాసులకు మొక్కల పెంపకం వల్ల కలిగే లాభాలను తెలియజేస్తూ మొ క్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంపై పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతుల రవళి, గోలి సునిత, జువ్వాజి శ్రీదేవి, గౌరిశెట్టి శిరీష, ముక్క సుమ, తదితరులు పాల్గొన్నారు.

22
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles