మొక్కలు నాటిన ఉపాధ్యాయులు

Thu,August 22, 2019 03:14 AM

బుగ్గారం : సిరికొండ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు బుధవారం మొక్కలు నాటారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలలో అంటుకంటిన పండ్ల మొక్కలను నాటినట్లు ప్రధానోపాధ్యాయులు శివానందం తెలిపారు. ఇటీవల కలెక్టర్ శరత్, జాయింట్ కలెక్టర్ రాజేశం, డీఈఓ వెంకటేశ్వర్ల సమక్షంలో జరిగిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాల ఆవరణలో అంటుకంటిన ఓ పండ్ల మొక్కను నాటాలని ఆదేశించారు. కేవలం నాటడమే కాక ప్రతి మొక్కకు ఒకరు లేదా రెండు విద్యార్థులను అసైన్ చేసి వాటి భాబోగులు చూసేలా చేయాలని సూచించారన్నారు. ఈ మేరకు హైబ్రిడ్ పండ్ల మొక్కలు నాటి, ట్రీగార్డులను ఏర్పాటు చేయడంతో పాటు, మొక్క ఉపాధ్యాయుడి వివరాలు కార్డుపై ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles