అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Thu,August 22, 2019 03:13 AM

మల్యాల: మండలంలోని లంబాడిపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి చొప్పదండి ఎ మ్మెల్యే సుంకె రవిశంకర్ బుధవారం శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ పరిధిలో మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీల నిర్మాణం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి కనబరుస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే లంబాడీపల్లి గ్రామంలో రూ.92లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో ఎల్లంకి లక్ష్మి ఇంటి నుంచి లంబాడిపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భూమిపూజ చేసినట్లు తెలిపారు.

గ్రామీణ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా విద్య, వైద్యంపైనే దృష్టి సారించిందన్నారు. అనంతరం స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి మార్కండేయ పద్మశాలీ సంఘ భవన నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. తమ సంఘ భవనానికి మొదటిసారిగా వచ్చిన ఎమ్మెల్యే రవిశంకర్‌ను భక్తమార్కండేయ పద్మశాలీ సేవా సంఘం సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ విమలాదేవి, జడ్పీటీసీ సభ్యుడు కొండపలుకుల రాంమోహన్‌రావు, సర్పంచ్ కట్కూరి తిరుపతి, ఎంపీటీసీ సభ్యురాలు కట్కూరి నవత, సర్పంచ్ మిట్టపెల్లి సుదర్శన్, నాయకులు కాటిపాముల రాజేందర్, పెంట నారాయణ, పెద్దూరి లక్ష్మీరాజం, పెంట సుధాకర్, శ్రీనివాస్, ప్రభాకర్, రమేశ్, శ్రీధర్, వేముల మల్లేశం, బసవయ్య, నారాయణ, సతీశ్, రాజు, ఆసం శివకుమార్, ఆగంతం వంశీ, క్యాతం భూపతిరెడ్డి, రవి, సత్తన్న, కొమురయ్య, అజారొద్దీన్, శేఖర్, కోటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles