మంకీ ఫుడ్‌కోర్టుల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్

Thu,August 22, 2019 03:13 AM

జగిత్యాల టౌన్: ముఖ్యమంత్రి హరిత మిషన్‌లో భాగంగా కోతుల ఆహారం కోసం పండ్ల మొక్కల ప్లాంటేషన్‌పై బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మండల అధికారులతో జేసీ బి.రాజే శం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుకున్న ప్రకారం అటవీశాఖ 18 మండలాలకు సంబంధించిన తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్సారెస్పీ, ఇతర శాఖల వారీగా ప్రతి మండల పరిధిలో ఎన్ని ప్లాంటేషన్లు ఏర్పాటు చేశారు.. ఎన్ని ఎకరాల్లో స్థల సేకరణ చేశారనే అంశంపై చర్చించారు. ఇప్పటివరకు ఎన్ని పండ్ల మొక్కలను నాటారు.. ఇంకా ఎన్ని నాటాల్సి ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి 50వేల పండ్ల మొక్కలు జిల్లాకు తెప్పించామనీ, ప్రస్తుతం కోతులకు ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌లో మామిడి, జామ పండ్ల మొక్కలను నాటాలని ఆదేశించారు. నాటిన మొక్కలకు నీరు పోయడంతో పాటు వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ప్లాంటేషన్‌లో 2వేల మొక్కలు తప్పక ఉండాలనీ, స్థలం ఎక్కువగా ఉంటే ఎక్కువ నాటినా అభ్యంతరం లేదన్నారు. రెండు వేలకు తక్కువ మొక్కలు నాటకూడదని పేర్కొన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారి నర్సింగారావు, జిల్లా పరిషత్ సీఈవో ఎ.శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి శేఖర్, జడ్పీ ఏవో శ్రీలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles