సమాజంపై అవగాహన పెంచుకోవాలి

Wed,August 21, 2019 04:21 AM

జగిత్యాల లీగల్‌: విద్యార్థులు సమాజంపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో ‘జీవన నై పుణ్యాలు-వ్యక్తిత్వ వికాసం’అనే అంశంపై సద స్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ, వి ద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకోవాలని, సా మాజిక బాధ్యతతో మెలగాలని అన్నారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని అధిరోహించాలన్నారు. అనంతరం శాతవాహన విశ్వవిద్యాల యం ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ హరికాం త్‌ మాట్లాడుతూ, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాముఖ్యత, దాని ఆవశ్యకత వలంటీర్ల ప్రాముఖ్యతను వివరించా రు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ను ఘ నంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ చెట్‌పెల్లి సుధాకర్‌, డైరెక్టర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ చిట్ల సుధీర్‌, వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాల సలహాదారు పురుషోత్తం, వ్యక్తిత్వ వికాస శిక్షకుడు ప్రవీణ్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ సుదర్శన శర్మ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles