ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవ ం

Tue,August 20, 2019 12:45 AM

పెగడపల్లి : మండలం బతికపల్లి గ్రామంలో సోమవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు జరిపారు. మండల ఫొటో గ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సర్పంచ్ తాటిపర్తి శోభారాణి మాట్లాడుతూ ఫొటో ప్రతి దృశ్యం సజీవంగా ఉంచుతుందన్నారు. ఫొటోగ్రఫీకి మంచి గుర్తింపు ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శి నిఖిల్‌రెడ్డి, సంఘం సభ్యులు లక్ష్మీరాజం, రాజు, శ్రీనివాస్, విజయ్, సురేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

వెల్గటూరు: మండల ఫొటో, వీడియోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ డేను సోమవారం జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ తీశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా సీనియర్ ఫొటోగ్రాఫర్లను శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఇక్కడ సర్పంచ్ మెరుగు మురళీగౌడ్, ఉపసర్పంచ్ గుండాటి సందీప్‌రెడ్డి, సంఘం మండల అధ్యక్షుడు బండారి సహదేవ్, నాయకులు తిప్పర్తి రామస్వామి, కల్యాణం లక్ష్మి, బద్దపురి భూమ య్య, సత్యం, తిప్పర్తి సీతారాములు, సురేష్, పురాణం సంపత్, వెంకటేశ్ పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles