గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన

Tue,August 20, 2019 12:45 AM

కొడిమ్యాల : మండలంలోని నాచుపల్లి ,సూరంపేట గ్రామాల్లో కేంద్ర బృందం సభ్యులు సోమవారం పర్యాటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంకుడుగుంతలు, డ్రైనేజీల నిర్మాణంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని ప్రతి వాడ లో పరిశుధ్య పనులను పరిశీలించారు. ప్రతి ఇంటా వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వాహణకు తీసుకుంటున్న చర్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. పైపు కంపోస్టు ఎరువుల తయారీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తడి, చెత్త పొడి చేత్త వేరు చేసి ఎరువుగా మార్చుకునే పద్ధతిపై ప్రజల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డైనేజీలు,రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మహిళా సంఘ భవనాలు, కుల సంఘాల భవనాలను పరిశీలించారు. పారిశుధ్యంపై సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కేంద్ర బృందం గ్రూప్ లీడర్ రంజిత్‌కుమార్, సభ్యులు జితేందర్, శ్రీకాంత్, స్వామి, మనోహర్, శ్రీకాంత్ ,ఆయా గ్రామాల సర్పంచులు అంబటి లత, దర్శనాల కౌసల్య, ఎంపీపీ మే న్నేని స్వర్ణలత, ఎంపీడీవో రమేశ్, ఏపీఎం దేవరాజం, గ్రామస్థాయి అధికారులు తదితరులున్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles