కలెక్టర్‌కు వినతి

Tue,August 20, 2019 12:44 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : తెలంగాణ మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యపై విద్యార్థులకు మరిన్ని అవకాశాలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల నాగరాజు ఆధ్వర్యంలో కలెక్టర్ శరత్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ జ్యోతిబాపూలే బీసీ విద్యార్థుల విదేశీ విద్యానిధి పేరిట పథకం ప్రవేశపెట్టారాన్నరు. రాష్ట్రంలో కేవలం 300 మందికే అవకాశం కల్పిస్తున్నారనీ, కనీసం వెయ్యి మందికి ఈ పథకం వర్తింపజేయాలన్నారు. ఆదాయ పరిమితిని కూడా రూ.6లక్షలకు పెంచాలన్నారు. చింతల గంగాధర్, మోత్కూరి సుధీర్ కుమార్, సత్యరాజ్, గుగ్గిళ్ల సత్యనారాయణ, తిరుపతి, లింబాద్రి, అరుణ్, శ్రీనివాస్, శ్రీహరి, గంగాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles