మల్లాపూర్ మండలం రేగుంటలో..

Mon,August 19, 2019 12:53 AM

మల్లాపూర్: మండలంలోని రేగుంట గ్రామాన్ని సచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర బృందం కమిటీ సభ్యులు సందర్శించారు. గ్రామంలోని వ్యక్తిగత మరుగుదొడ్లు, మురికి కాలువలు, ప్రధాన రహదారులు, ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలతోపా టు గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామం లో స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల వాడకంపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. టీం సభ్యులు రంజిత్, ఉపేందర్, శ్రీకాంత్, స్వా మి, జడ్పీ ఏఓ శ్రీలతరెడ్డి, ఎంపీడీవో కోటేశ్వర్‌రా వు, జడ్పీటీసీ సభ్యుడు సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, స ర్పంచ్ కుందేళ్ల నర్సయ్య, ఎంపీటీసీ సభ్యుడు గ డ్డం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధికార ప్రతినిధి కాటిపల్లి ఆదిరెడ్డి తదితరులున్నారు.
ఇబ్రహీంపట్నం: మండలంలోని గోధూర్, యామాపూర్ గ్రామాలను స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర బృందం సభ్యులు సందర్శించారు. గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించిన అనంతరం వారితో కలిసి మొక్కలు నాటారు. సర్పంచులు సోమ ప్రభాకర్, తలారి మనీషా, ఎంపీపీ జాజాల బీమేశ్వరి, ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
కథలాపూర్: మండలంలోని తాండ్య్రాల గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అధికారుల బృందం పర్యటించి గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించారు. కార్యక్రమంలో వారితోపాటు ఎంపీడీఓ ప్రభు, ఈఓపీఆర్డీ తౌఖిర్‌అహ్మద్, సర్పంచ్ గడిల గంగప్రసాద్, వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్‌రావు, ఏపీఎం నరహరి, ఏపీఓ సతీశ్, పంచాయతీ కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles