రాళ్ల చెరువులోకి నీటి తరలింపు

Sun,August 18, 2019 02:52 AM

పెగడపల్లి : మండలం ఐతుపల్లి పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండడంతో సమీపంలోని రాళ్ల చెరువుకు శనివారం నీటిని విడుదల చేసినట్లు సర్పంచ్ జిట్టబోయిన కొండయ్య తెలిపారు. కొత్త చెరువు నుం చి రాళ్ల చెరువుకు నీళ్లు వెళ్లే కాలువలో పూడిక, పిచ్చిమొక్కలు పెరడగంతో పాలకవర్గ సభ్యులతో కలిసి ఎక్స్‌కవేటర్‌తో తొలగించినట్లు చె ప్పారు. అలాగే వర్షాలకు రోడ్లు బురదగా మారడంతో స్వచ్ఛభారత్ నిర్వహించి శుభ్రం చేసినట్లు సర్పంచ్ వివరించారు. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువకు నీటి విడుదల చేయడంతో, ప్రత్యేక తూము నుంచి ఐతుపల్లి చెరువుకు నీటి విడుదల త్వరలోనే జరుగనుందనీ, దీంతో గ్రామంలో తాగు, సాగు నీటి కష్టాలు తీరుతాయన్నారు. తూమును ఏర్పాటు చేయించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యదర్శి వాజిద్ ఉప సర్పంచ్ లచ్చయ్య, వార్డు సభ్యులు జేరిపోతుల శ్రీనివాస్, తడగొండ సాగర్, రాజు, మంత్రి మల్లేశం, ఉత్తం చంద్రయ్య, శ్రీనివాస్ ఉన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles