నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

Sun,August 18, 2019 02:50 AM

జగిత్యాల లీగల్ : విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం స్థానిక శ్రీనిధి జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతికయుగంలో విద్యార్థులు కేవలం చదువుతే ప్రధానం కాదనీ, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నైపుణ్యంతో కూడిన శిక్షణ అవసరమని చెప్పారు. ఆ దిశగా ప్రతీ విద్యార్థి ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదనీ, స్వయం, స్వశక్తితో ముందుకెళ్లాలన్నారు. విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

కామర్స్ విద్యార్థులు ఆర్థిక రంగంలో రాణించేందుకు కృషి చేయాలనీ, ప్రధానంగా బ్యాకింగ్ ఉద్యోగాలపై దృష్టి సారించాలన్నారు. యువత కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక ఉపాధి శిక్షణ సెంటర్లు ఏర్పాటు చేసిందనీ గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం మల్లల్‌రావు, సంతోష్‌రావు, అయిల్నేని సాగర్ రావు, టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దావ సురేష్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles