టీఆర్‌ఎస్ సీనియర్ నేత మృతి

Sat,August 17, 2019 03:48 AM

మల్లాపూర్: మల్లాపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత ముద్దం శ్రీనివాస్‌గౌడ్ (59) హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించినట్లు బాధిత కుటుంబ సభ్యు లు శుక్రవారం తెలిపారు. శ్రీనివాస్‌గౌడ్ టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచీ సీఎం కేసీఆర్‌తో కలిసి పార్టీలో క్రియాశీ లకంగా పనిచేశారు. గతంలో టీఆర్‌ఎస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా, గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. ఈయన సతీమణీ ముద్దం విమల 2000 సంవత్సరంలో మల్లాపూర్ ఎంపీపీగా పనిచేశారు. శ్రీనివాస్‌గౌడ్ మంచి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు-సరోజన దంపతులు పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

శ్రీనివాస్‌గౌడ్ మృతి టీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటు
టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత ముద్దం శ్రీనివాస్‌గౌడ్ మృతి చెందడం బాధాకరమనీ, ఆయన టీఆర్‌ఎస్ పార్టీకి చేసిన సేవలు మరువలేవని స్థానిక కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్‌గౌడ్ కీలక పాత్ర పోషించారనీ, నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ పటిష్టతకు ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. తనకు నమ్మిన వ్యక్తిగా ప్రతి ఎన్నికల్లో చురుకుగా పనిచేశారని పేర్కొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles