సర్కారు దవాఖానాల్లో మెరుగైన సేవలు

Sat,August 17, 2019 03:48 AM

మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ దవాఖానాల్లో రోగుల కు మెరుగైన వైద్య సేవలు అం దించాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే క ల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పే ర్కొన్నారు. గురువారం రాత్రి స్థానిక సామాజిక వైద్య శాల అభివృద్ధి సొసైటీ (సీహెచ్‌సీ) సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖానలో వైద్య సేవల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వ దవాఖాన లో వైద్య సేవలు బాగున్నాయనీ, ప్రసవాల్లో రాష్ట్రంలోనే ప్ర త్యేక గుర్తింపును పొందడం అభినందనీయమన్నారు.

ఖాళీ గా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులు, డిప్యూటేషన్‌పై వెళ్లిన ఇద్దరు వైద్యులకు సంబంధించి దవాఖాన సూపరింటెండెంట్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అందుకు స్పందించిన ఆ యన. వైద్యా విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్‌ను కలిసి వెంట నే అవసరమైన వైద్యులు, సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయించేందుకు కృషి చేస్తానన్నారు. వైద్యులు, సిబ్బంది కొర త ఉన్నా సమస్యను అధిగమించి ప్రసవాల్లో, రోగులకు వైద్యసేవలు అందించడంలో వైద్యుల, సిబ్బంది పనితీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. మెట్‌పల్లిలోనూ త్వరలోనే 50 పడకల సామర్థ్యం కలిగిన దవాఖానను వంద పడకలకు విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల నుంచి పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యం కోసం వస్తుంటారనీ, వారికి ఇబ్బంది లేకుండా మెరుగైన సేవలం దించాలనీ, సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో సూపరింటెం డెంట్ డా. అమరేశ్వర్, ఎంపీపీ మారు సాయిరెడ్డి, స ర్పంచ్ బద్దం శేఖర్‌రెడ్డి, వైద్యులు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles