దినసరి కూలి రూ.600 చెల్లించాలి

Wed,August 14, 2019 01:10 AM

హుజూరాబాద్‌టౌన్: కేంద్రప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కనీస వేతనాల చట్టానికి విరుద్ధంగా రోజువారి కూలిని రూ.178గా ప్రకటించడాన్ని తెలం గాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖండిస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్ల రా జు పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరుగుతుంటే కార్మికుల కనీస వేతనాన్ని పెంచాల్సింది పోయి రూ.178గా కుదించడం సిగ్గు చేటన్నా రు. వెంటనే కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రం ఎత్తివేయాలని కుట్రలు చేస్తుందని, అలా చేస్తే కార్మిక సంఘాలన్నిటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం రోజు కూలీ రూ.600 చొప్పున కలం కార్మికులతో సహా చెల్లించాలని పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఇమ్మడి మహేందర్, ఇమ్మడి రమేష్, ఎం అభిలాష్ తదితరులు పాల్గొన్నారు

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles