ఎట్టకేలకు పట్టుబడ్డ చెల్లని చెక్కు నిందితుడు

Wed,August 14, 2019 01:07 AM

శంకరపట్నం: చెల్లని చెక్కు కేసులో 35 ఏండ్లుగా పోలీసుల కండ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు కట్ట పడ్డాడు. కేశవపట్నం ఎస్‌ఐ ఎం శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. 1985 సంవత్సరంలో మండలంలోని చింతలపల్లికి చెందిన (ప్రస్తుత నివాసం వికారాబాద్) చంద శంకరలింగం (72) మండల కేంద్రంలోని రాయమల్లు వద్ద వ్యక్తిగత అవసరాల కోసం రూ. 10 వేలు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు మరునాడు ఇస్తానని చెప్పి చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేశాడు. దీంతో రాయమల్లు ఫిర్యాదు చేయగా, అప్పట్లో శంకరలింగంపై కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నింధితుడు పట్టుబడ్డాడు. కానిస్టేబుల్ తిరుపతి హుజురాబాద్‌లో తి రుగుతున్న శంకరలింగంను మంగళవారం చాకచక్యంగా పట్టుకున్నాడు. ఎట్టకేలకు 35 ఏళ్లకు పట్టుబడ్డ నింధితుడిని కోర్టులో హాజరుపరచినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలి పారు. శంకరలింగంను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన కానిస్టేబుల్ తిరుపతిని సీపీ కమలాసన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles