వృత్తి నైపుణ్య శిక్షణతో ఉజ్వల భవిష్యత్

Tue,August 13, 2019 03:12 AM

-మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు
-జీయర్ ట్రస్ట్ ఆశ్రమ భవనంలో నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం
-పాల్గొన్న మైహోం సంస్థ అధినేతరామేశ్వర్‌రావు
-హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు

మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ : వృత్తి నైపుణ్య శిక్షణతో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. మెట్‌పల్లి మండలం వెంకట్రావుపేట శివారులోని అర్బన్ హౌసింగ్ కాలనీ సమీపంలో ని చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ ఆశ్రమ భవనంలో జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, ప్రతిమ ఫౌండేషన్, టా టా ైస్ట్రెవ్ సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన నైపు ణ్య శిక్షణ కేంద్రాన్ని సోమవారం గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మన దేశం లో యువత ఎక్కువ సంఖ్యలో ఉందనీ, నిరుద్యోగ నిర్మూలన, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలనే సంకల్పంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 1.4 మిలియన్లకు స్కిల్ డెవలప్‌మెంట్ కల్పించేందుకు సీఎస్‌ఆర్ (కంపెనీల సామాజిక బాధ్యత) విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కంపెనీలో వచ్చే లాభాల్లో 2 శాతం స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నా రు. జర్మనీ, ఇజ్రాయిల్, చైనా దేశాలు కేవలం స్కిల్ డెవలప్‌మెంట్ ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మెరుగైన ఫలితాలతో అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయన్నారు.

జర్మనీలో విద్య తక్కువగా ఉన్నా అక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువ అని అన్నారు. ఇజ్రాయిల్‌లో కొత్త విషయాలను కనుగొనడంలో ప్రపంచ దేశాల్లో రెండో స్థానంలో ఉందనీ, ఆదేశం స్టార్టప్‌లో ముం దంజలో ఉందని పేర్కొన్నారు. చదువు అంటే కేవ లం బీఏ, బీకాం, బీఎస్సీ యే కాదని, సమాంతరంగా సాంకేతిక, సాంకేతికేతర వృత్తి విద్యా కో ర్సులను చేయడం వల్ల ప్రభు త్వ, ప్రైవేట్ రంగా లు, అదే విధంగా దేశ, విదేశాల్లో చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను లభిస్తాయన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ వల్ల దేశం సర్వతో ముఖాభివృద్ధి చెం దుతుందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వే లాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిం చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు జీయర్ ట్రస్ట్, మై హోం సంస్థ అధినేత రామేశ్వర్‌రావు, ప్రతిమ పౌండేషన్ చైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు ముందుకు వచ్చారనీ, వీరి భాగ స్వామ్యంతో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ వారి టాటా ైస్ట్రెవ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే రాయికల్, నాగారంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయనీ, ఇల్లంతకుంటలోనూ త్వరలోనే నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

మహా గవర్నర్‌కు ఘన సన్మానం
మెట్‌పల్లి వచ్చిన మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావును పలువురు స్థానిక నా యకులు ఘనంగా సన్మానించారు. జ్ఞానోదయ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, స్వర్ణకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇల్లెందుల కృష్ణమాచారి గవర్నర్‌ను గజమాలతో సత్కరించారు. గతంలో మెట్‌పల్లి నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీ గా రెండు సార్లు పని చేసిన విద్యాసాగర్‌రావు ఈప్రాంతానికి సుపరిచితుడు కావడంతో ఆయనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో పాత మెట్‌పల్లి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. కార్యక్రమాల్లో నిజామాబాద్, కరీంనగర్ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, మైహోం సంస్థ అధినేత రామేశ్వర్‌రావు, ప్రతిమ పౌండేషన్ చైర్మన్ బోయినపల్లి శ్రీనివాస్‌రావు, టాటా ైస్ట్రెవ్ సీఈఓ అనితరాజన్, మురళి, సుధాకర్, మోరపల్లి సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు..
మెట్‌పల్లి టౌన్ : నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా మెట్‌పల్లి అంబేద్కర్ స్టేడియానికి చేరుకున్న మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు పలువురు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జడ్పీ అధ్య క్షురాలు దావ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మెట్‌పల్లి సబ్ కలెక్టర్ గౌతమ్ పూట్రుతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పాలికారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహనికి గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే కల్వకుంట్ల పూలమాలలు వేసి నివాళులర్పించారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles