అన్ని వర్గాలవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు

Tue,August 13, 2019 03:08 AM

సారంగాపూర్: కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం సారంగాపూర్ తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకం పేదింటి యువతులకు వరంగా మారిందన్నారు. పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుడి వరకు ఏదో రకంగా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు అమలు చేస్తున్నారన్నారు. త్వరలోనే డబుల్ ఇండ్ల నిర్మాణాలు జరుగుతాయన్నారు. గ్రామాల్లో వివాహమైన తర్వాత పంచాయతీల్లోనే రిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా కల్యాణలక్ష్మి చెక్కులు తీసుకుంటున్న వారికి చెక్కుతో పాటు చీరెలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున, జడ్పీ సభ్యుడు మేడిపల్లి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సొల్లు సురేందర్, తాసిల్దార్ నవీన్, మండల రైతు సమన్వయ సమితి సభ్యుడు కోల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు గుర్రాల రాజేందర్‌రెడ్డి, కొత్తూరి రాజేశ్వరి, జోగిన్‌పెల్లి సుధాకర్‌రావు, ఢిల్లీ రామారావు, పల్లపు వెంకటేశ్, భుక్య సంతోష్, అజ్మిర శ్రీలత, మానాల సహస్రమాల, నాయకులు తోడేటి శేఖర్‌గౌడ్, ఏలూరి గంగరెడ్డి, అజ్మిర శ్రీనివాస్, మానాల వెంకటరమణ, బింగి శ్రీనివాస్, ఏలేటి నర్సింహారెడ్డి, డీటీ శ్రీనివాస్, ఆర్‌ఐ వంశీకృష్ణ, పంచాయతీ కార్యదర్శి శేఖర్, ఆయా గ్రామాల నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles