తెలంగాణ సాధనకు 1969 ఉద్యమ స్ఫూర్తి కీలకం

Tue,August 13, 2019 03:08 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ: 1969 ఉద్యమకారులు ఇచ్చిన స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధనకు కీలకమైందని 1969 ఉద్యమకారుల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ అన్నా రు. జిల్లా కేంద్రంలో సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 1969-2019 అర్ధశతాబ్ది సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఉద్యమం కోసం అమరులైన 369 మందికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. 1969 ఉద్యమంలో అమరులై వారితో పాటు, ఉద్యమంలో పాల్గొన్నవారికి సమరయోధుల పింఛన్ ఇవ్వాలన్నారు. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయనీ, ఒక తెలంగాణ ఉద్యమం మాత్రమే చరిత్రలో నిలిచిందన్నారు.

తొలి, మలిదశ ఉద్యమాలకు సిద్ధాంతకర్తగా నిలిచిన జయశంకర్‌సార్‌తో మడమ తిప్పని పోరాటం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనకు మూల కారణమైన సీఎం కేసీఆర్‌కు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఉద్యమకారులకు పెన్షన్ సౌకర్యంతో పాటు గృహవసతి, ఉచిత వైద్య సౌకర్యం నామినేటేడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. గౌరిశెట్టి విశ్వనాథం, మున్సిపల్ మాజీ చైర్మన్ జీఆర్ దేశాయి, జనార్దన్, మానాల కిషన్, విద్యాసాగర్, గుండేటి గంగాధర్, రఘుపతి, చింతకింద కృష్ణయ్య, సత్యనారాయణ, రాజగోపాలచారి, లక్ష్మీనారాయణరెడ్డి, ప్రేంసాగర్, ప్రకాశ్‌రావు, వెల్పుల నారాయణ, యాదగిరి, వకులభరణం నర్సింహాచారి, పద్మ పాపయ్య, శంకర్‌గౌడ్, పబ్బ శివానందం, భూమానందం, రాపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles