నేడు జడ్పీ తొలి సర్వసభ్య సమావేశం

Tue,August 13, 2019 03:07 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక మినీ కల్యాణ మండపంలో మంగళవారం జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన జడ్పీ సభ్యులు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీలు డి.ఆర్వింద్, బండి సంజయ్, వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, విద్యాసాగర్‌రావు, రవిశంకర్, రమేశ్‌బాబు హాజరవుతారన్నారు. కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులు సమావేశానికి హాజరవుతారన్నారు. ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. సకాలంలో హాజరు కావాలని కోరారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles