హరిత తెలంగాణ సాధనకు సీఎం కృషి

Tue,August 13, 2019 03:07 AM

సారంగాపూర్: తెలంగాణ రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎంతో కృషి చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రం శివారులోని బతుకమ్మ కుంట సమీపంలోని అడవుల్లో సోమవారం ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పండ్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గత పాలకుల విధానాలు సరిగా లేకపోవడంతోనే అడవులు అంతరించి పోయాయన్నారు. దీంతో విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయనీ, జగిత్యాల ప్రాంతంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగాయన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి అందులో గ్రామానికి అవసరమైన 50నుంచి 70వేల వరకు మొక్కలను నాటుతున్నారన్నారు. ప్రపంచంలో ఒక్క బ్రెజిల్ దేశంలో మినహా తెలంగాణాలోనే ఎక్కువగా మొక్కలను మనమే నాటామన్నారు. కోతులు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు రాకుండా అడవిలోనే వాటికి సంబంధించిన 13 రకాల పండ్ల మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. అడవుల్లో రావి, మర్రి, సీమచింత, వెలగ, మారేడు, నేరేడు, చింత, బాదం మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు.

సారంగాపూర్ గ్రామ శివారులోని బతుకమ్మ కుంట సమీపంలో బ్లాకును తాసిల్దార్ నవీన్‌కు అటాచ్ చేయడంతో పండ్ల మొక్కలను నాటారని పేర్కొన్నారు. గ్రామాల్లో అందరి భాగసామ్యంతో విరివిగా మొక్కలు నాటాలనీ, ఎవరైనా చెట్టును నరికితే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. అటవీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చెట్లు నరికితే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతుయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున, జడ్పీ సభ్యుడు మేడిపల్లి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సొల్లు సురేంవర్, తాసిల్దార్ నవీన్, డీటీ శ్రీనివాస్, ఆర్‌ఐ వంశీకృష్ణ, మండల రైతు సమన్వయ సమితి సభ్యుడు కోల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు గుర్రాల రాజేందర్‌రెడ్డి, కొత్తురి రాజేశ్వరి, జోగిన్‌పెల్లి సుధాకర్‌రావు, ఢిల్లీ రామారావు, పల్లపు వెంకటేశ్, అజ్మిర శ్రీలత, మానాల సహస్రమాల, నాయకులు తోడేటి శేఖర్‌గౌడ్, విజయ్, గంగయ్య, ఏలూరి గంగరెడ్డి, నర్సయ్య, అజ్మిర శ్రీనివాస్, మానాల వెంకటరమణ, బింగి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శేఖర్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles