స్వగ్రామంలో కిషన్‌రావు అంత్యక్రియలు

Tue,August 13, 2019 03:06 AM

కోనరావుపేట: మండలంలోని మల్కపేట గ్రామానికి చెందిన కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మిడ రాజేశ్వర్‌రావు తండ్రి కిషన్‌రావు (105) ఆదివారం దవాఖానలో హఠాన్మర ణం చెందగా స్వగ్రామంలో సోమ వారం అంత్యక్రియలు నిర్వహించా రు. మండల ప్రజలు, బంధువులు పెద్దఎత్తున తరలివచ్చి కిషన్‌రావు పార్థివదేహానికి పూలువేసి నివాళులర్పించారు. ప్రముఖులు జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, టెస్కబ్ చైర్మ న్ కొండూరి రవీందర్‌రావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, సెస్ మాజీ చైర్మన్, వె లమ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షు డు చిక్కాల రామరావుతోపాటు పలువురు చైర్మన్ రాజేశ్వర్‌రావును పరామర్శించారు. కిషన్‌రావు పార్థివ దే హం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, సెస్ డైరక్టర్ తిరుపతి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షు డు మంతెన సంతోష్,సర్పంచ్‌లు లత,దేవయ్య,సం తోష్, ఎంపీటీసీ మిర్యాల ప్రభాకర్‌రావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శ
కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావును సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం పరామర్శించారు. మల్కపేటలోని ఆయన స్వగ్రామానికి చేరుకున్న మంత్రి, డెయిరీ చైర్మన్ తండ్రి కిషన్‌రావు చిత్రపటం వద్ద పూలు వేసి నివాళి అర్పించారు. మృతి పట్ల విషయాలను అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట జగిత్యాల జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ హరిచరణ్‌రావు, సింగిల్ విండో చైర్మన్ రమణారావు ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, సెస్‌డైరక్టర్ దేవరకొండ తిరుపతి, సర్పంచ్ ఆరె లత, మామిడిపల్లి ఎంపీటీసీ మిర్యాల ప్రభాకర్‌రావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డి, నాయకులు ఉన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles