దుబ్బరాజన్న ఆలయంలో శ్రావణ సందడి

Tue,August 13, 2019 03:06 AM

సారంగాపూర్: మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పెంబట్ల శ్రీదుబ్బరాజేశ్వరస్వామి ఆలయంలో రెండో శ్రావణ సోమవారం సందర్భంగా ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులు అన్నపూజలు, అభిషేకాలు, కోడె మొక్కులు, బెల్లం, కుంపటి, గండదీపం తదితర మొక్కులు చెల్లించుకున్నారు. దుబ్బ రాజేశ్వరస్వామి ఆలయానికి ఎల్‌ఈడీ టీవీని గంట సంతోష్, రాధ దంపతులు విరాళంగా అందజేశారు.

అలాగే మండంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రేచపల్లి శ్రీజగన్నాథ స్వామి, సారంగాపూర్ సీతారామచంద్రస్వామి, బీర్‌పూర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి, తుంగూర్ వేణుగోపాల స్వామి, రాజరాజేశ్వరస్వామి, కొల్వాయి రామాలయాలతో పాటు పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో రేచపల్లి గ్రామానికి చెందిన గోత్రాల కళాకారులు భక్తుల కాలక్షేపం కోసం గాత్ర కచేరి నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కోల జమున, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కోల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు బొడ్డుపెల్లి రాజన్న, ఆకుల జమున, దుబ్బ రాజన్న ఆలయ కార్యనిర్వహణ అధికారి సీడీ రాజేశ్వర్, ట్రస్ట్ ఫౌండర్ పోరండ్ల శంకరయ్య, రజినీకాంత్, రవి, శ్రీనివాస్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

దుబ్బరాజన్న ఆదాయం రూ.లక్షా 29వేలు
శ్రీదుబ్బరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ఒక్కరోజు రూ.లక్షా 29వేల ఆదాయం సమకూరినట్లు ఈవో సీడీ దుబ్బరాజేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శ్రావణమాసం సందర్భంగా ఒక్కరోజే వివిధ టిక్కెట్ల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles